FREE SHIPPING ON ORDERS INR 500 AND ABOVE

About Herbal Remedy Kit in Telugu

హెర్బల్ రెమెడి కిట్

హెర్బల్ ఫస్ట్ ఎయిడ్ కిట్

మీ చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులకు మా సులభమైన పరిష్కారం .

 ఒక్క సారి ఆలోచించండి

జలుబు చేసిందా? ఇదిగో ఈ డీ కోల్డ్ టోటల్ వేసుకో. అన్నం సరిగా అరగక గ్యాస్ వొస్తోందా? ఇదుగో ఈ Gelusil వేసుకో, పోనీ ఓ గ్యాస్ టాబ్లెట్ వేసుకోపోయావా? ఇది ఏమి మనకు కొత్త కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరములుగా టీవీలు న్యూస్ పేపర్లు మనకు 24 గంటలు గుర్తు చేస్తూ వున్నాయి. 

కానీ మీరు ఎపుడైనా ఇలా విన్నారా? 
పొడి దగ్గు వస్తోందా? ఒక పావు స్పూన్ యష్టిమధు చూర్ణం తేనే తో తీసుకోండి , అని ఎప్పుడైనా, ఎవరైనా చెప్పడం విన్నారా?

మీకు తెలుసా, జలుబు, దగ్గు, అసిడిటీ లాంటి ఇబ్బందులు ఇంగ్లీష్ మందులు లేకుండా ఆయుర్వేద మూలికల ద్వారా కూడా నయం చేయవచ్చు. ఇది 5000 సంవత్సరాలగా మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన కానుక/విద్య.  ఇండియా లో 52% మంది, స్వయంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడుతన్నారు . వారు డీ కోల్డ్, జెలూసిల్, లాంటి OTC మందులు లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటిబయోటిక్స్ వాడుతున్నారు. ఆలా వాడటం వల్ల కొన్ని సంవత్సరాలకి ఆ మందులు వారికి ఇంక  పనిచేయవు.అంతే కాదు, ఇంగ్లీష్ మందులు అతిగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్  కూడా వుంటాయి. అది మీకు చెప్పనవసరం లేదు.  మరి, అలాంటప్పుడు, చిన్న చిన్న ఇబ్బందుల  నుంచి రిలీఫ్ పొందటానికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని హెర్బల్ మెడిసిన్ ఎందుకు వాడకూడదు?


ఒక్క సారి ఆలోచించండి.  

మనకి, వాతావరణం/సీసన్ బట్టి , వాన కాలం గాని, చలి కాలం లో గాని వచ్చే ఇబ్బందులు ఏమిటీ? జలుబు, తల నొప్పి, పొడి దగ్గు, బొంగురు గొంతు. అప్పుడప్పుడు , కొంచం ఆహారం లో తేడా వస్తే? గ్యాస్ లేదా అజీర్ణం.

దాదాపు, వీటి అన్నింటికీ మీరు ఎప్పుడో ఒకప్పుడు మెడికల్ షాప్ కి వెళ్లి, “బాబు , తల నొప్పికి, ఓ టాబ్లెట్ ఇవ్వు” అనో లేదా మీకు తెలిసిన టాబ్లెట్ పేరు చెప్పో కొనుక్కొని వేసుకొని వుంటారు.

ఇలా చేయడం వల్ల , 2- 3 టాబ్లెట్స్ తో తగ్గుతుంది, అంత వరకు బానే వుంది. కానీ ఈ విషయం మీకు తెలుసా? ఇలాంటి ఓవర్ ది కౌంటర్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడ కూడదు . వాటి వల్ల దీర్ఘ కాలిక సైడ్ ఎఫక్ట్ ఉంటాయి. ఉదాహరణ కు – అల్ట్రా సెట్ లాంటి పెయిన్ కిల్లర్ వల్ల గుండె కి సంబందించిన వ్యాధులు వస్తాయి . సోర్స్

మరి ఇలా అల్లోపతి OTC మందులు కాకుండా ఈజీ గ దొరికే హెర్బల్ సదుపాయం ఎమన్నా వుందా?

ఉంది – అందుకే మేము ఈ హెర్బల్ రెమెడీ కిట్ తయారు చేసాం. మీలా బిజీ గా వుండే వారి కోసం, అన్ని సమయాల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ దొరికే అవకాశం లేని ప్రదేశాలో వుండే వారి కోసం ఈ  కిట్ తయారు చేసాం.

ఇది మిమ్మల్ని ఆలోచింప చేసేందుకు మా ప్రయత్నం

 హెర్బల్ రెమెడి కిట్

హెర్బల్ రెమెడీ కిట్ – ఇది హెర్బల్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ . 

అంటే అత్యవసర పరిస్థితులలో (Emergency లో ) అల్లోపతిక్ మందులు లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న వ్యాధులు (తలా నొప్పి, గ్యాస్, గొంతు బొంగురు పోవడం ) లాంటివి నివారించేందుకు పనికి వచ్చే కిట్ అన్న మాట.

ఎలా వాడాలి?

హెర్బల్ రెమెడీ కిట్ లో మీకు కావలిసిన 8 ముఖ్యమైన మూలికా చూర్ణాలు (హెర్బల్ పౌడర్లు) ఉంటాయి. ఒక్కక చూర్ణం 50 grams పౌచ్ లో ఉంటాయి. ఈ 8  చూర్ణం పౌచ్ లు ఓక reusable బాక్స్ లో మీకు అందించబడుతుంది. బాక్స్ లోపల చూర్ణం పౌచ్స్ తో పాటు ఒక ఇన్ఫర్మేషన్ బుక్లెట్ మరియు స్పూన్స్ ఉంటాయి.

ఈ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ లో, చూర్ణం గుణాలు, అవి ఏ ఏ ఇబ్బందులను తగ్గిస్తాయి , ఆ చూర్ణం ఎలా వాడాలి అన్న వివరాలు వుంటాయి.

మీకు ఏదైనా, ఇబ్బంది కలిగి నప్పుడు, ఈ బుక్లెట్ చూసి మీ ఇబ్బందిని ఎలా నివారించుకోవాలో నిర్ధారించు కోవచ్చు. అంతే కాదు , కొన్ని హెర్బల్ పౌడర్లు (మూలికా చూర్ణాలు) 2-3 ఇతర ఇబ్బందులకు కూడా వాడచ్చు. ఆ విషయూలు కూడా బుక్లెట్ లో ఉంటాయి.

చూర్ణం ఎందుకు?

ప్రపంచం అంతా , వేసుకోవడానికి ఈజీ గా వుండే క్యాప్సూల్, టాబ్లెట్స్ తయారు చేస్తూ ఉంటే, మీరేంటి ఇలా చూర్ణం ఇస్తున్నారు అనుకొంటున్నారా? ఎందుకంటే? ఆయుర్వేదం ప్రకారం, మూలికా పొడి (హెర్బల్ పొడి) సరైన అనుపానం తో తీసుకొంటేనే సరిగా పని చేస్తాయి. ఈ అనుపాన విధానం మీద ఎన్నో పుస్తకాలు కూడా వున్నాయి. కొన్ని మూలికలు తేనే తో గాని, నీటి తో గాని వాడాలి, కొన్ని పటిక బెల్లోము తో గాని, మజ్జిగ తో గాని వాడాలి. క్యాప్సూల్స్ తో ఆలా కుదరదు, అందుకున్న మాట .

ఏ చూర్ణం ఎంత వేసుకోవాలి ఆ వివరాలు ఉంటాయి , కొలత కు కావలిసిన స్పూన్స్ కూడా ఉంటాయి. అన్ని చూర్ణాలు resealable(ఓపెన్ చేసిన తరవాత మళ్ళి క్లోజ్ చేసేందుకు వీలుగా) వుండే జిప్ లాక్ పౌచెస్ లో ఉంటాయి.

ఈ చూర్ణాలు, భారత దేశం లో ప్రఖ్యాతి గాంచిన తయారీ దారుల నుండి తీసుకు వచ్చాము, పైగా ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ లాంటివి లేకుండా స్వచ్ఛమైన హెర్బల్ పౌడర్లు . ఇవి 18 నెలలు వరకు కూడా నిల్వ ఉంటాయి. కానీ ఒక్క జాగ్రత్త ఏమిటంటే , తడి స్పూన్స్ వాడకూడదు. అంతే!

మీరు ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ ఈ కిట్ తెప్పించు కోవచ్చు. ప్రస్తుతానికి ఆన్లైన్ లో మాత్రమే వున్నాయి, త్వరలో మీ దగ్గర లో ఉన్న సూపర్ మర్కెట్స్ లోకి గూడా రానున్నాయి.

ఈ హెర్బల్ పౌడర్లు నిజంగా పని చేస్తాయా?

ఇది మేము చూపుతున్నది కాదు , 2000 సంవత్సరాల ఆయుర్వేద విజ్ఞానం ద్వారా చెప్పబడినది. అంతే కాదు W.H.O (World Health Organization) వారిచే కూడా scientific(శాస్త్రీయం) గా నిరూపించబడినది.

కిట్ లో వున్న బుక్లెట్ లో ప్రతి మూలికా ఎలా పని చేస్తుందో నిరూపించే WHO వారి రీసెర్చ్ వివరాలు కూడా జత చేయబడి ఉంటుంది. అంతే కాదు Ayush Ministry( ఆయుష్ మంత్రిత్వ శాఖ) వారి రీసెర్చ్ వివరాలు కూడా ఉంటాయి.

మరో రకంగా చూడండి, పైన చెప్పిన విధంగా ఇవి ఆయుర్వేదం చెప్పిన మూలికలు. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు , ఒక్కక్క మొక్క తీసుకొని, దాని, వేరు, ఆకు, పూవు, బెరడు ఇవన్నింటి మీద ప్రయోగాలు చేసి, ఏది ఎలా పనిచేస్తుందో వ్రాసారు. ఒక్కొక్క తరం ఆ పుస్తకాలను కాపాడుతూ మనకి అందించాయి . నిజంగా ఆ మూలికలు పని చేయక పోతే ఇన్ని తరాలు, ఆ పుస్తకాలను జాగ్రత్త చేసి మనకు అందించే వారు కాదు కదా.

ఎలా కొనాలి?

మీరు హెర్బల్ రెమెడీ కిట్ తెప్పించుకోవాలి అనుకొంటే మాకు 8328103779 మీద వాట్సాప్ చేయండి  లేదా ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఈ సైట్ లో కొనుక్కోవచ్చు. 

ఒక్క మాట

అంతా బాగానే వుంది కానీ, మరి ఈ చూర్ణాల తోనే తగ్గి పోతే మరి డాక్టర్లు ఎందుకు అంటారా? అది కుడా ఒక సారి మాట్లాడు కొందాం.

పైన చెప్పినట్టుగా , ఇది కేవలం “ప్రాథమిక చికిత్స”(Primary care ) మాత్రమే. ఏ ఇబ్బంది ఐన 2 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే కచ్ఛితమైన  వైద్య సలహా తీసుకోవాలి.

ఇది తప్పని సరిగా గుర్తు పెట్టుకోవాలి.

మీకు ఇంకా ఎమన్నా వివరాలు కావాలన్నా 8328103779 మీద వాట్సాప్ చేయండి.

 

మీ కిట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి